అమాన‌వీయ ఘ‌ట‌న‌..15రోజుల పసికందు నోట్లో రాయి పెట్టి మూతికి జిగురు అతికించి..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ముక్కుపచ్చలారని ఓ పసికందును కన్న తల్లిదండ్రులే కర్కశకంగా ప్రవర్తించారు. 15 రోజుల పసికందును అడవిలో వదిలేశారు. ఆ బిడ్డ నోట్లో రాయి పెట్టి, మూతి మీద జిగురు అతికించి ఊపిరాడకుండా చేసిన ఘటన అందరినీ కలచివేస్తోంది. ఈ హృదయ విదారక సంఘటన రాజస్థాన్ లోని భిల్వారా జిల్లా పరిధిలో జరిగింది. అడవిలో గేదెలను మేపుతున్న ఓ పశువుల కాపరి పొదల మధ్య ఆ పాపను గమనించాడు. చిన్నారి శ్వాస కోసం పోరాడుతూ కనబడటంతో వెంటనే దగ్గరికి వెళ్లాడు. పాప నోటికి...