పెండింగ్ కేసులను తక్షణమే పరిష్కరించాలి

సీపీ గౌస్ ఆలం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ టౌన్ డివిజన్ ఏసీపీ కార్యాలయాన్ని బుధవారం పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై సమీక్ష నిర్వహించి, వాటిని తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అర్బన్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కమిషనర్ మాట్లాడుతూ రౌడీషీటర్లు, హిస్టరీషీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని, ప్రతి నెలా వారిపై తాజా సమాచారాన్ని సేకరించి నమోదు చేయాలని తెలిపారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన...