Viral Video: ఐక్యరాజ్యసమితిలో హార్ట్-టచ్ చేసిన ముస్లిం లీడర్ .. ‘ఓం శాంతి’ అంటూ సందేశం..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రసంగం వైరల్ గా మారింది. ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశ అధ్యక్షుడు ఓం శాంతి ఓం, నమో బుద్ధాయ అనడం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ప్రపంచం మొత్తం కూడా భయం, ఆందోళన, హింసతో నిండిపోయిందని..బెదిరింపులు, ఉగ్రవాదం నుంచి విముక్తి పొందాలని సందేశం ఇవ్వడం అందర్నీ ఆకట్టుకుంది. ప్రబోవో తన ప్రసంగాన్ని ఓం శాంతి ఓం తో ముగించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశంలో...