సింగరేణి బదిలీ వర్కర్లను జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరణ
సీఎండీ ఎన్.బలరామ్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ కాకతీయ, కొత్తగూడెం రూరల్: సింగరేణి సంస్థలో బదిలీ వర్కర్లుగా చేరి భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ గనులు లేదా సర్ఫేస్ లో పనిచేస్తూ 190/240 మస్టర్లు పూర్తి చేసిన వారిని జనరల్ అసిస్టెంట్ కేటగిరి-1గా క్రమబద్ధీకరించేందుకు వీలుగా సింగరేణి యాజమాన్యం బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మేరకు సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2024 డిసెంబర్ 31, అంతకు ముందు తమ సంవత్సరకాలం సర్వీసు...