గుట్టలను మింగేస్తున్నరు

విచ్చలవిడిగా మట్టి తవ్వుతున్న మాఫియా యథేచ్ఛగా పునాదిరాయి తరలింపు గుట్ట స్థలాలను ఆక్రమించి పంట పొలాలు చోద్యం చూస్తున్న మైనింగ్, రెవెన్యూ శాఖలు కాకతీయ, కొత్తగూడెం రూరల్: జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల గుట్టలను కొందరు ఇష్టారాజ్యంగా కొల్లగొడుతున్నారు. గుట్టల సంపద వెలికితీస్తూ దానిని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని జూబ్లీపురం గ్రామ సమీపంలోని కారుకొండ గుట్టను మాఫియా గ్యాంగ్...