గిరిజన మహిళలకు టిప్పా స్కానింగ్ చేయాలి
ఐటీడీఏ ఏడీఎంహెచ్వో డాక్టర్ సైదులు కాకతీయ, మణుగూరు : ఏజెన్సీ గ్రామాలలో నివసిస్తున్న ఐదు నెలలు నిండిన గర్భిణీలకు తప్పనిసరిగా టిప్పా స్కానింగ్ చేయాలని ఐటీడీఏ ఎడిఎంహెచ్వో డాక్టర్ సైదులు మణుగూరు ఏరియా ఆసుపత్రి డాక్టర్లకు సూచించారు. బుధవారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఆదేశాల మేరకు మణుగూరు మండలంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఏరియా ఆసుపత్రి కి వచ్చే రోగులకు అందిస్తున్న వైద్య తీరును, టిప్ప స్కానింగ్ పనితీరును పరిశీలించారు. అనంతరం ఆయన డాక్టర్లతో మాట్లాడుతూ...