Maoist: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డికి కన్నీటి వీడ్కోలు.!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కోసా అంత్యక్రియలు గురువారం జరిగాయి. ఉదయం మ్రుతదేహం ఇంటికి చేరుకుంది. కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరుమున్నీరు అయ్యారు. కడారి సత్యనారాయణ రెడ్డి డెడ్ బాడీ ఇంటికి చేరుకోవడంతో గ్రామస్తులు, ప్రజా సంఘాల నేతలు, అభిమానులు పలువురు సానుభూతిపరులు గోపాలరావు పల్లెకు చేరుకుని ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాసంఘాల నేతలు లాల్ సలాం అంటూ నినాదాలు చేశారు. జోరువానలోనే అంత్యక్రియలను నిర్వహించారు. కడారి సత్యనారాయణ రెడ్డి క్లాస్...