Heavy Rains: దూసుకొస్తున్న గండం.. నేడు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే కొన్ని రోజులుగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు మళ్లీ వాయువ్య దిశలో గాలుల ప్రభావం, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. నేడు (బుధవారం), రేపు (గురువారం) రాష్ట్రంలోని చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం...