New Liquor Shops Notification: తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు నోటిఫికేషన్.. రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరణ

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు సంబంధించి ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అనంతరం అక్టోబర్ 23న డ్రా (లక్కీ డిప్) పద్ధతిలో మద్యం దుకాణాల కేటాయింపులు జరగనున్నాయి. కొత్తగా కేటాయించే షాపుల లైసెన్స్ కాలపరిమితి 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. టెండర్ ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం రూ. 3 లక్షలుగా నిర్ణయించింది....