Girls Molest: దారుణం.. ప్రేమ పేరుతో ముగ్గురు బాలిక‌ల‌పై అత్యాచారం..!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో ముగ్గురు మైనర్ బాలికలకు మాయమాటలు చెప్పి యాదగిరిగుట్టకు తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అల్వాల్‌కు చెందిన 9వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు, పాఠశాలలో బతుకమ్మ వేడుకలున్నాయని చెప్పి ఇంటి నుండి బయటకు వెళ్లారు. అయితే సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో బాలికలు తార్నాక ప్రాంతంలో తిరుగుతుండగా, అక్కడే ముగ్గురు యువకులు వారిని ప్రేమిస్తున్నామని నమ్మించారు. నిందితులు...