PM Modi: భవిష్యత్తులో పన్నులు మరింత తగ్గిస్తాం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: రష్యాతో బంధం కాలపరీక్షలను తట్టుకుంటూ మరింత బలపడిందని అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉత్తర్ ప్రదేశ్ లోని గౌతమ్ బుద్ధానగర్ లో మొదలైన ట్రేడ్ షోలో జరిగిన సభలో ప్రధాని మాట్లాడారు. ఈ వాణిజ్య ప్రదర్శనకు కూడా మాస్కో భాగస్వామిగా వ్యవహరిస్తుందని తెలిపారు. దేశం స్వయంసమ్రుద్ధిలో ఉత్తరప్రదేశ్ పాత్రను ఆయన కొనియాడారు. భారత్ లో తయారయ్యే మొబైల్ ఫోన్లలో అత్యధికం ఇక్కడి నుంచే వస్తున్నాయని అన్నారు. సెమీకండక్టర్ రంగంలోనూ భారత్ స్వయంసమ్రుద్ధి సాధించాలని పేర్కొన్నారు. భారత్ లోనే చిప్ నుంచి...