భద్రకాళి గుడిలో నాగుపాము కలకలం.!!

కాకతీయ, వరంగల్ బ్యూరో: భద్రకాళి అమ్మవారి ఆలయంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఆలయంలోకి అకస్మాత్తుగా నాగుపాము రావడంతో అక్కడి భక్తులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం ప్రకారం, మొదట భద్రకాళి గుడిలో కనిపించిన నాగుపాము, ఆపై గణపతి ఆలయం వైపు వెళ్లింది. నాగుపామును గమనించిన ఒక భక్తుడు వెంటనే భద్రకాళి ఆలయ సిబ్బందికి సమాచారం అందించాడు. ఆ సమాచారం అందుకున్న సిబ్బంది వెంటనే అప్రమత్తమై చర్యలు చేపట్టారు. ఆలయంలో ఉన్న భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని, ఆలయ సిబ్బందిలోని నాగరాజు చాకచక్యంగా పామును...