Maganthi Sunitha: జూబ్లీహిల్స్‌ BRS అభ్యర్థిగా గోపీనాథ్‌ భార్య సునీత పేరు ఖరారు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్‌ భార్య మాగంటి సునీతను పార్టీ అధినేత కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, “జూబ్లీహిల్స్‌ ప్రజల ఆకాంక్షల మేరకే మాగంటి సునీతకు అవకాశం కల్పించాం. ఆమె ప్రజల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కార మార్గాలు చూపగల సామర్థ్యం ఉన్న నాయకురాలు” అని పేర్కొన్నారు. గతంలో జూబ్లీహిల్స్‌ నుంచి గోపీనాథ్‌ పలు సార్లు విజయం సాధించిన విషయం...