KTR: అరెస్టు చేస్తారా? చేసుకోండి.. కేటీఆర్ మాస్ వార్నింగ్..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన అరెస్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని రెండేండ్లుగా చూస్తున్నాను..వారు ఇంకా అరెస్టు చేస్తామనే కలలు కంటున్నారని పేర్కొన్నారు. చూసి చూసి వాళ్ల కళ్లు కాయలు కాస్తున్నాయంటూ విమర్శించారు. తెలంగాణ భవన్ లో ఎల్ అండ్ టీ సంస్థపై మీడియాతో మాట్లాడిన సందర్భంగా కేటీఆర్ అరెస్టుపై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనకాల ఓ స్కీమ్...