ముందస్తు ప్రణాళికలతో ఎన్నికలను విజయవంతం చేయాలి..!!

కాకతీయ, గీసుకొండ: రాబోయే గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలను ప్రతి అధికారి ముందస్తు ప్రణాళికలతో పనిచేసి విజయవంతం చేయాలని ఎంపీడీఓ వి.కృష్ణవేణి సూచించారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ప్రిసైడింగ్ అధికారుల శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ట్రైనింగ్ అబ్జర్వర్ కె.వేదవతి, ఎంపీడీఓ వి. కృష్ణవేణి మాట్లాడుతూ ఎన్నికలు పూర్తిగా పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా సాగాలి అని పేర్కొన్నారు. నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావాలని, అభ్యర్థులు సమర్పించే ప్రతి నామినేషన్‌ను సక్రమంగా పరిశీలించి...