Cow Seemantham : నర్సంపేటలో ఆవుకు సీమంతం.. గ్రామంలో సంబురాలు..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: వరంగల్ జిల్లా నర్సంపేటలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా సీమంతం అంటే మనుషులకే నిర్వహించే వేడుక అని అనుకుంటాం. కానీ గ్రామస్థులు ఓ ఆవుకు సీమంతం నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. గ్రామంలో ఉన్న ఓ కుటుంబం తమ ఇంట్లో పెంచుతున్న ఆవు గర్భవతిగా ఉందని తెలుసుకొని, దానికి సాంప్రదాయ పద్ధతుల్లో సీమంతం జరిపారు. పల్లెటూరి ఆచారాల ప్రకారం మహిళలకు చేసే విధంగానే పసుపు, కుంకుమతో ఆవును అలంకరించి, పూలదండలు వేసి, శుభకార్యాల వాతావరణం సృష్టించారు. ప్రత్యేకంగా పూజలు చేసి, ఆవు...