ఆసరా కోసం వేదన – లైన్లలో విలవిలాడుతున్న వృద్ధులు
ఆసరా కోసం వేదన – లైన్లలో విలవిలాడుతున్న వృద్ధులు కాకతీయ, నర్మేట్ట: జనగామ జిల్లా నర్మెట్ట గ్రామంలో ఈరోజు ఉదయం నుంచి ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. వృద్ధులు, వికలాంగులు తమ పింఛన్ల కోసం పెద్ద ఎత్తున క్యూలైన్లలో నిలబడ్డారు. అధికారులు ఐరిస్ పద్ధతిలోనే పంపిణీ చేయడంతో ఉదయం నుంచి గంటల తరబడి లైన్లో నిలబడి వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 80 ఏళ్ల పైబడిన పెద్దవాళ్లు వర్షంలో తడుస్తూ, నేలపై కూర్చొని లేదా కష్టపడి నిలబడుతూ తమ వంతు కోసం...