KCR: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో విజయం మనదే: కేసీఆర్
కాకతీయ, తెలంగాణ బ్యూరో: త్వరలోనే జరగనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాని..ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని విజయం సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. శుక్రవారం ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్ తోపాటు పలువురు నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ వారికి...