భద్రాచలం వద్ద 43 అడుగుల నీటిమట్టం

మొదటి ప్రమాద హెచ్చరిక జారీ లోతట్టు ప్రాంతాల వాసులను అలెర్ట్ చేసిన అధికారులు కాకతీయ, భద్రాచలం : ఎగువున్న ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరుకు భారీగా నీరు చేరడంతో గోదావరి ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43.00 అడుగులకు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం 9,32,228 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న క్రమంలో కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ముంపు ప్రాంత గ్రామాల ప్రజలను...