200 కిలోల గంజాయి దహనం

కాకతీయ ఖమ్మం ప్రతినిధి: వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ నేతృత్వంలో శనివారం దహనం చేశారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో పట్టుబడిన, సీజ్ చేసిన 200 కిలోల ఎండు గంజాయిని అడిషనల్ డీసీపీ ప్రసాదరావు పర్యవేక్షణలో తల్లాడ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గోపాల్‌పేట గ్రామంలో ఉన్న ఏడబ్ల్యూఎం కన్సల్టెన్సీ లిమిటెడ్‌లో నిర్వీర్యం చేశారు. ఖమ్మం వన్ టౌన్, ఖమ్మం టూ టౌన్, ఖమ్మం త్రీ టౌన్, ఖమ్మం రూరల్, కూసుమంచి, వి.యం.బంజారా, కారేపల్లి, పోలీస్...