సైబర్ నేరస్తుడు అరెస్టు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఆన్లైన్ లో డబ్బులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేసిన కేసులో ఒకరిని ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసినట్లు సి.పి. సునిల్ దత్ తెలిపారు. కేసు వివరాలలోకి వెళితే.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలానికి చెందిన ఓ సివిల్ ఇంజనీర్ కు ఫోన్ చేసి ఆన్లైన్ లో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని ఆశచూపారు. కాగా అతడు వాట్సప్, ట్రేడింగ్ లింకుల ద్వారా సుమారు రూ.11 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోయాడు....