బీసీ రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టు 8కి విచారణ వాయిదా..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు మరోసారి జరిగాయి. గవర్నర్ వద్ద బీసీ రిజర్వేషన్ల బిల్లు ఇంకా పెండింగ్‌లో ఉండగానే ప్రభుత్వం జీవో జారీ చేయడం సరైందా? అనే అంశంపై న్యాయస్థానం సీరియస్‌గా స్పందించింది. రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను గుర్తుచేస్తూ, ఈ విషయంపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరుతూ.. దసరా సెలవుల తర్వాతే వాదనలు వినిపించేందుకు వీలు కల్పించండి అన్నారు. దీనిపై హైకోర్టు, తదుపరి విచారణను...