Musi: ఉప్పొంగిన మూసీ..చాదర్ ఘాట్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఎంజీబీఎస్ వద్ద మూసీ ప్రమాదకరస్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తోంది. శుక్రవారం రాత్రి 8 నుంచి ఎంజీబీఎస్ లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ బస్టాండ్ కు వచ్చే రెండు వంతెనల పై నుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. దీంతో ఎంజీబీఎస్ ను తాత్కాలికంగా మూసివేశారు. మరోవైపు చాదర్ ఘాట్ దగ్గర చిన్న వంతెనపై వరద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఆ వంతెనను కూడా మూసివేయడంతో పెద్ద వంతెనపైనే రాకపోకలు సాగుతున్నాయి. దీంతో చాదర్ ఘాట్ పరిసరప్రాంతాల్లో గంటల తరబడి...