I Love Muhammad: ఐ లవ్‌ మహమ్మద్‌ ఆందోళనలు.. ముస్లిం మతగురువు అరెస్టు..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ నగరంలో “I Love Muhammad” అనే క్యాంపైన్‌ను మద్దతుగా పిలుపునిచ్చిన స్థానిక ముస్లిం మతగురువు ఇత్తెహ‌ద్ ఇ మిల్ల‌త్ కౌన్సిల్ చీఫ్ తౌకీర్ రాజాను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్యాంపైన్‌కు మద్దతుగా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకావాలని తౌకీర్ రాజా పిలుపునిచ్చాడు. ఫలితంగా శుక్రవారం ప్రార్థనల తర్వాత ఆయన ఇంటి ముందు పెద్ద సంఖ్యలో ప్రజలు గుమ్మిగూడారు. అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తూ, రాళ్లు వేస్తున్న కొంతమందిపై లాఠీచార్జ్ చేశారు. ఈ ఘర్షణలో...