Local body Elections: పల్లె పోరుకు రంగం సిద్ధం..ఏ క్షణమైనా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్..!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఇప్పటికే వివిధ విభాగాలతో సమీక్షలు జరిపి, ఓటర్ల సౌకర్యం, భద్రత, సిబ్బంది కేటాయింపు వంటి అంశాలపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా ఈసారి ఎన్నికలను మూడుదశల్లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం ఈనెల 30వ తేదీ లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. రిజర్వేషన్ల నివేదికలు అందిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు...