ములుగులో లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డు అందజేత..!!

కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నగదు రివార్డులు శనివారం అందజేశారు. జిల్లా ఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో లొంగిపోయిన మావోయిస్టు సభ్యులు మడవి మంగ్లీ @ మాసే, మడకం కమలేష్, మడకం భీమేలకు రూ.25,000 చొప్పున తక్షణ సహాయం, అలాగే వారి క్యాడర్ స్థాయికి అనుగుణంగా మిగిలిన రివార్డు మొత్తాలను చెక్కుల రూపంలో అందజేశారు. మడవి మంగ్లీకి రూ.3.75 లక్షలు, మడకం కమలేష్, మడకం...