Saddula Bathukamma 2025: మంగళవారం సద్దుల బతుకమ్మ.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో బతుకమ్మ సంబరాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేస్తూ, ఈ సంవత్సరం సద్దుల బతుకమ్మ పండుగను 2025 సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం రోజున అధికారికంగా నిర్వహించాలని ప్రకటించింది. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం అమావాస్యనాడు జరుపుకునే సద్దుల బతుకమ్మకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పూలతో బతుకమ్మను అలంకరించి పాడుతూ, నృత్యాలు చేస్తూ బతుకమ్మకు ఘనంగా వీడ్కోలు పలుకుతుంటారు. ఈ పండుగను తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా...