VC Sajjanar: హైద‌రాబాద్ సీపీగా స‌జ్జనార్.. రాష్ట్రంలో 23 మంది ఐపీఎస్‌లు బ‌దిలీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో 23 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్తం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సీటీ పోలీస్ కమిషనర్ గా వీసీ సజ్జనార్ నియమితులయ్యారు. ప్రస్తుతం సీపీగా కొనసాగుతున్న సీవీ ఆనంద్..హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బదీల్లో భాగంగా ఆర్టీసీ ఎండీ పోస్టును నాగిరెడ్డికి కట్టబెట్టింది ప్రభుత్వం. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగ డీజీగా శిఖా గోయల్ నియమితులయ్యారు....