TG Assembly: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లపై విచారణకు షెడ్యూల్ రిలీజ్..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల సెప్టెంబర్ 29, అక్టోబర్ 1 తేదీల్లో విచారణ జరగనుందని స్పీకర్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఈ కేసులో పిటిషనర్లుగా బీఆర్‌ఎస్ నేతలు కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. వీరు స్పీకర్‌కు ఫిరాయింపు వ్యతిరేక చట్టం కింద పిటిషన్లు దాఖలు చేశారు. ప్రతివాదులుగా కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలైన టి. ప్రకాశ్ గౌడ్, కాలె...