బీసీ రిజర్వేషన్ల జీవోపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు ..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ పై జారీ చేసి జీవోపై హైకోర్టులో వాదనలు వాడీవేడిగా సాగుతున్నాయి. గవర్నర్ వద్ద బీసీ బిల్లు ఇంకా పెండింగ్‌లో ఉండగానే ప్రభుత్వం జీవో విడుదల చేయడం సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. బిల్లు ఆమోదం పొందకముందే ముందుకు సాగడం చట్టపరంగా సరైన ప్రక్రియ కాదని జడ్జీలు స్పష్టం చేశారు. హైకోర్టు, "రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే నిబంధన ఉంది కదా?" అంటూ అడ్వకేట్ జనరల్‌ను ప్రశ్నించింది. ఈ విషయంలో అనేక క్లారిఫికేషన్లు ఇవ్వాలని కోర్టు కోరింది. అయితే...