డ్రెనేజీలు ఆక్రమణ..

రోడ్డు పక్కన డబ్బా దుకాణాలు ఏర్పాటు వాటిని కిరాయికి ఇస్తున్న కబ్జాకోరులు బాబు క్యాంప్ ఏరియాలో ఇష్టారీతిన ఆక్రమణలు చోద్యం చూస్తున్న అధికారులు కాకతీయ, కొత్తగూడెం రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండల పరిధిలోని బాబు క్యాంప్ ప్రాంతంల్లో భూకబ్జాల పర్వం ఎక్కువైంది. ముఖ్యంగా డ్రైనేజీలపై చిన్న చిన్న బడ్డీ దుకాణాలను ఏర్పాటు చేస్తూ వాటిని కొందరు అద్దెకిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బడ్డీ దుకాణాల వల్ల డ్రైనేజీలు శుభ్రం చేయడం ఇబ్బందికరంగా మారిందని పలువురు వాపోతున్నారు. జిల్లా పరిషత్ ఉద్యోగుల...