వికసిత్ భారత్‌లో యువత పాత్ర కీలకం
బండి సంజయ్ కాకతీయ, కరీంనగర్: వికసిత్ భారత్ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు. శనివారం కరీంనగర్ మహాశక్తి ఆలయం వద్ద వరంగల్ వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్” గోడ ప్రతిని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. వికసిత్ భారత్ కోసం యువత అందరూ ఒక్క తాటిపైకి వచ్చి, దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే అభివృద్ధి వేగవంతమవుతుందని అన్నారు....