ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించండి, బహుమతులు పొందండి
కాకతీయ, పినపాక: ఈ నెల 27 నుంచి అక్టోబర్ 6 వరకు డీలక్స్, సూపర్ లగ్జరీ, లహరి, ఏసీ రాజధాని బస్సులలో ప్రయాణించండి, రూ.50 వేల విలువైన బహుమతులను గెలుచుకోండి అని డిపో మేనేజర్ కె. శ్యాంసుందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు టిక్కెట్ వెనకాల పేరు, ఫోన్ నెంబర్ను రాసి లక్కీ డ్రా బాక్స్ లో టికెట్ వేసినట్లయితే డ్రా తీసి విలువైన బహుమతులను అందిస్తామని ప్రకటనలో తెలిపారు. మొదటి బహుమతిగా రూ.25 వేలు, రెండో బహుమతిగా 15వేలు, మూడో బహుమతిగా రూ.10వేలను అందిస్తారన్నారు....