బాపూజీ ఇంట్లోనే టీఆర్ ఎస్ ఆవిర్భావం..

కాకతీయ, వరంగల్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆఅవిర్భావం కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లోనే జరిగిందని, ఆయన చరిత్ర ప్రజా పోరాటాలతో నిండిపోయిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం రమణా రెడ్డి మాట్లాడారు. మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు బాపూజీ ఎన్నో త్యాగాలు చేశారని గుర్తుచేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బాపూజీ సేవలను గుర్తించి...