అన్ని సమస్యలను విడతలవారీగా పరిష్కరిస్తాం

రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కాకతీయ, ములుగు ప్రతినిధి : అంగన్వాడి, ఆశా వర్కర్ల సమస్యలను విడతలవారీగా పరిష్కరించడానికి కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన పలు కార్యక్రమాలలో ఆమె పాల్గొన్నారు. ముందుగా గిరిజన భవన్‌లో ములుగు, మల్లంపల్లి మండలాల అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్‌లో అంగన్వాడి...