భగత్ సింగ్ స్పూర్తితో యువత రాజకీయాల్లోకి రావాలి
కాకతీయ, కొత్తగూడెం : భగత్ సింగ్ కలలు కన్న సమసమాజ స్థాపనకు యువత మరో స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధం కావాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లిక్కి బాలరాజు, కాళంగి హరికృష్ణ పిలుపునిచ్చారు. కొత్తగూడెంలో జరిగిన భగత్ సింగ్ జయంతి కార్యక్రమాలలో వారు పాల్గొని మాట్లాడారు. దేశ స్వాతంత్రం కోసం చిన్న వయసులోనే చిరునవ్వుతో ఉరికంబాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు భగత్ సింగ్ అని కొనియాడారు. స్వాతంత్ర్యం పట్ల స్పష్టమైన అవగాహనతో భగత్ సింగ్ పోరాటం చేశాడని అన్నారు. నేటి పాలకులు స్వాతంత్ర దినోత్సవ...