శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గుర్తు తెలియని దుండగులు బాంబు ఉందంటూ ఈమెయిల్ పంపడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రయాణికులకు సూచించారు. ఎటువంటి ఆందోళనకు గురికావద్దని, ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ పూర్తి స్థాయిలో ముమ్మరంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఇటీవల...