Karur Stampede: తొక్కిసలాట ఘటనలో కుట్ర కోణం.. హైకోర్టుకు టీవీకే..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: కరూర్ జిల్లాలో టీవీకే వ్యవస్థాపకుడు విజయ్ ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇందులో కుట్ర కోణం ఉందని స్వతంత్ర దర్యాప్తు జరపాలంటూ ఆ పార్టీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైతున్నట్లు సమాచారం. ర్యాలీ జరుగుతుండగా రాళ్లు రువ్వడంతో పాటు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో గందరగోళ పరిస్థితులు నెలకున్నట్లు టీవీకే వెల్లడించింది. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుందని ఆరోపించింది. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సోమవారం మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్ ను ఆశ్రయించనున్నట్లు వెల్లడించింది....