దసరా ఉత్సవాల కోసం పీస్ కమిటీ సమావేశం..!!

కాకతీయ, నల్లబెల్లి: గత సంవత్సరం దసరా ఉత్సవాల సమయంలో నల్లబెల్లి మండల కేంద్రంలో చోటు చేసుకున్న గొడవల నేపథ్యంలో, ఈ ఏడాది అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ రోజు నల్లబెల్లి పోలీస్ స్టేషన్‌లో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏసీపీ నర్సంపేట, సీఐ దుగ్గొండి హాజరై, దసరా ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో జరిగేలా అందరూ సహకరించాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు. అధికారులు ఉత్సవాల సందర్భంగా ఎవ్వరూ చట్టాన్ని...