ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి ..!!

కాకతీయ, రాయపర్తి /తొర్రూరు : సద్దుల బతుకమ్మ, దసరా పర్వదినం సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువులో జరగనున్న సద్దుల బతుకమ్మ సంబరాల ఏర్పాట్లను ఆదివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని, మహిళలు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొనే ఈ వేడుకలు ఎలాంటి అంతరాయం లేకుండా విజయవంతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. భద్రతా...