CM Revanth Reddy: ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌ను కలుపుతూ రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ రహదారి..నేడు పనులకు సీఎం శంకుస్థాపన..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో మరో కీలక ఘట్టానికి తెరలేవనుంది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్), ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)లను అనుసంధానించే అత్యంత ప్రతిష్టాత్మకమైన 'రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ రహదారి' నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నగర శివారు ప్రాంతాల స్వరూపాన్నే మార్చేస్తుందని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య దూరాన్ని గణనీయంగా తగ్గిస్తుందని అధికారులు భావిస్తున్నారు. రావిర్యాల్ ఓఆర్‌ఆర్ ఇంటర్‌ఛేంజ్ నుంచి ఆమన్‌గల్ వరకు మొత్తం 41.50 కిలోమీటర్ల పొడవునా...