Heavy Rains: మరో బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. రాష్ట్రంలో నాన్‌స్టాప్ భారీ వర్షాలు.!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి శనివారం తీరం దాటింది. దీని ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, వాతావరణ శాఖ మరో కీలక అప్డేట్ ఇచ్చింది. అక్టోబర్ 1న బంగాళాఖాతంలో మళ్లీ కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కొనసాగనున్నాయని అంచనా వేసింది. ఉపరితల ద్రోణి కూడా ప్రభావం చూపుతుండటంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. తెలంగాణ వాతావరణ...