Future City: భవిష్యత్తు అంతా ఫ్యూచర్ సిటీలోనే ఉంది: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఐటీ, ఫార్మా, వ్యవసాయ రంగానికి సంబంధించిన పరిశ్రమలు, అంతర్జాతీయ స్టేడియం వంటి వాటితో అద్భుతమైన నగరంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగబోతోందని.. భవిష్యత్తు అంతా ఇక్కడే ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఈ దేశ భవిష్యత్తు అంతా ఈ ఫ్యూచర్ సిటీ చుట్టే తిరగబోతుందేమో అన్న భావన తనకు కలిగిందని డిప్యూటీ సీఎం అన్నారు. ఎలివేటెడ్ కారిడార్ లతో అద్భుతమైన రోడ్లు, మధ్యన మెట్రో రైలు దేశంలోని ఏ నగరానికి ఈ వ్యవస్థ లేదు అన్నారు....