హత్య కేసులో నిందితుల అరెస్ట్
కాకతీయ, జగిత్యాల : జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన యువకుడి హత్య కేసులో సారంగాపూర్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. సెప్టెంబర్ 27న సాయంత్రం రేచపల్లి గ్రామానికి చెందిన ఎదురుగట్ల సతీష్ (30) తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటుండగా నాథరి వినంజి, నాథరి శాంత, నాథరి జల అలియాస్ శనిగరపు జల సతీష్ పై దాడి చేశారు. సతీష్ గతంలో ఇన్‌స్టాగ్రామ్‌లో నిందితుల కుటుంబానికి చెందిన ఓ మహిళతో దిగిన ఫోటోను...