పాప‌న్న విగ్రహ‌ ప్రతిష్ఠ‌కు భూమి పూజ

కాకతీయ, హనుమకొండ : హన్మకొండ హంటర్ రోడ్డులోని గౌడ హాస్టల్ ఎదుట‌ సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్ఠ‌ భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా గోపా కోఆర్డినేటర్ తీగల జీవన్ మాట్లాడుతూ.. భారత మాత ముద్దుబిడ్డ, తొలి తెలుగు చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర ప్రపంచ ప్రసిద్ధి గాంచిందని గుర్తుచేశారు. సామాజిక న్యాయం, స్వాభిమానం, సమానత్వం కోసం పోరాడిన యోధుడని కొనియాడారు. తెలంగాణ తిరుగుబాటుకు స్ఫూర్తి నిచ్చిన వీరుడు పాపన్న గౌడ్...