రాజ‌న్న సిరిసిల్ల కలెక్టర్‌గా ఎం.హరిత

కాకతీయ‌, రాజ‌న్న సిరిసిల్ల : రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా ఎం.హరిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా సమీకృత కార్యాలయానికి చేరుకున్న ఆమెకు అధికారులు స్వాగతం పలికారు. తన ఛాంబర్‌లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంత‌రం వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, సిబ్బంది కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు.