విజ‌య్ ర్యాలీలో తొక్కిస‌లాట‌పై రాజ‌కీయ దుమారం

కుట్రకోణం ఉందని టీవీకే పార్టీ ఆరోపణ విద్యుత్ సరఫరాను నిలిపివేశారని విమర్శలు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తమిళనాడులోని కరూర్ జిల్లాలో టీవీకే వ్య‌వ‌స్థాప‌కుడు, న‌టుడు విజ‌య్ ప్ర‌చార ర్యాలీలో తొక్కిసలాట ఘ‌ట‌న త‌మిళ‌నాడులో రాజ‌కీయం దుమారం రేపుతోంది. రెండు రోజుల క్రితం టీవీకే అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 40 మందికిపైగా మ‌ర‌ణించ‌డం.. ప‌దుల సంఖ్య‌లో గాయ‌ప‌డ‌టం తెలిసిందే. ఈ దుర్ఘటనపై ప్రభుత్వం, టీవీకే పార్టీల మధ్య పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి. తొక్కిసలాట ఘటన వెనుక కుట్ర ఉందని, విజయ్...