Lotte Group: ఏపీలో పెట్టుబడులకు లొట్టే గ్రూప్‌ను ఆహ్వానించిన మంత్రులు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ లొట్టే (Lotte) గ్రూప్ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ మంత్రులు పి. నారాయణ, బీసీ జనార్ధన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర ఉన్నతాధికారులు, ఎం.టీ.కృష్ణ బాబు, ఇండియన్ ఎంబసీ ప్రతినిధులు, ఈడీబీ అధికారులు కూడా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫుడ్, రిటైల్, కెమికల్స్, అతిథ్య రంగాల్లో విస్తృత పెట్టుబడులు పెట్టిన లొట్టే గ్రూప్‌ను ఏపీలోనూ వ్యూహాత్మక పెట్టుబడులకు ఆహ్వానించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మౌలిక...