ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలి

పీస్ కమిటీ సమావేశంలో మామునూరు ఏసీపీ వెంకటేష్ కాకతీయ, గీసుగొండ : రానున్న దసరా పండుగను, గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని మామునూరు ఏసీపీ వెంకటేష్ అన్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీ పెద్దలతో మంగళవారం నిర్వహించిన పీస్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో, పండుగ వేళల్లో ప్రజల మధ్య సఖ్యతా భావం నెలకొనాలని, ఎటువంటి విఘాతం కలగకుండా అందరూ సహకరించాలని ఏసీపీ పిలుపునిచ్చారు. ప్రజల భద్రత మా మొదటి కర్తవ్యమని, ఎవరూ చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడరాదని...