ఎన్నికలు పారదర్శకంగా జరగాలి
జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ కాకతీయ, వరంగల్ బ్యూరో : భూపాలపల్లి జిల్లాలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగడానికి రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. మంగళవారం ఐడిఓసీ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన సమావేశంలో కలెక్టర్ రాజకీయ పార్టీల నేతలతో సమావేశమై ఎన్నికల నిబంధనలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లు తెలిపారు. అనుమతి లేకుండా ఎలాంటి సమావేశాలు, సభలు నిర్వహించరాదని హెచ్చరించారు....